Friday, January 3, 2025

అలాంటి వ్యక్తి నాకు రావాలి

- Advertisement -
- Advertisement -

ప్రతి హీరోయిన్‌కి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న… ఎలాంటి భర్త కావాలి అనుకుంటున్నారు? ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ కి కూడా ఈ ప్రశ్న మీడియా నుంచి వచ్చింది. ఆమె తాజాగా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న జాన్వీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని చేసుకునేవారు ఎలా ఉండాలో చెప్పగలరా..? అని అడగ్గా ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది జాన్వీ. “నా కలలను తనవిగా భావించి.. ఎల్లప్పుడు నాకు అండగా ఉండాలి. ఎప్పుడూ నాకు సంతోషాన్ని ఇవ్వాలి. ఎల్లప్పుడూ నన్ను నవ్విస్తూనే ఉండాలి. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి నాకు భర్తగా రావాలి”అని పేర్కొంది జాన్వీ కపూర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News