Friday, December 20, 2024

2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: సజ్జల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయంపై తమకు పూర్తి విశ్వాసంతో ఉందని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019లో వచ్చిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం​ లేదన్నారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ చేశారని విమర్శించారు.

జగన్‌ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పారు. ఓటింగ్‌ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దని ఆయన పేర్కొన్నారు. కేంద్రంతో కలిసి కొంతమంది అధికారులను కుట్రపూరితంగా చంద్రబాబు తప్పించారని ఆరోపించారు. అధికారుల మార్పుతో…టిడిపి కార్యకర్తలకు పోలీసులు సహకరించారని.. దాంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాని సజ్జల చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News