Friday, December 20, 2024

మోడీతో ఏది చెప్పించాలన్న చెప్పిస్తాను: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

రాయబరేలి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటు కేరళలోని వాయ్ నాడ్ నుంచి, అటు రాయబరేలి నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన రాయబరేలిలో ప్రచారం చేస్తూ ‘‘ నేను ప్రధాని నరేంద్ర మోడీ తో ఏదైనా చెప్పించగలను. నరేంద్ర మోడీ అంబానీ, అదానీ పేర్లను ఎత్తనే ఎత్తరని నేనన్నప్పుడు ఆయన రెండు రోజలు తర్వాత అదానీ, అంబానీ ల పేర్లను ఎత్తారు. ఆ తర్వాత నేను బ్యాంకు ఖాతాలో డబ్బు టకాటక్ వేస్తానని చెప్పాను.  నరేంద్ర మోడీ తర్వాత ‘టకాటక్’ అని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఏమి చెప్పించాలనుకుంటున్నారో నాకు చెప్పండి. నేను రెండు నిమిషాలలో చెప్పిస్తాను. అలాగే ఆయనతో ఏమి చెప్పించకూడదనుకుంటున్నారో అది కూడా చెప్పండి. దానిని కూడా నేను ఆయన చేత చేపిస్తాను’’ అన్నారు.

‘‘ మోడీ ఓటమిని అంగీకరిస్తున్నారు. జూన్ 4 తర్వాత మోడీ ప్రధానిగా ఉండబోరని నేను రాసిస్తాను’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

రాయ్ బరేలి లోక్ సభ ప్రచార సభ ర్యాలీలో సోనియా గాంధీ ప్రసంగించారు. ఆ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ కూడ ఉన్నారు. సోనియా గాంధీ తన ప్రసంగంలో 20 ఏళ్లుగా రాయ్ బరేలి ఎంపీగా సేవలందించేందుకు సహకరించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

సోనియా గాంధీ తన ప్రసంగంలో ‘‘ ఇది నా జీవితంలో పెద్ద ఆస్తి. మీకు గౌరవపూర్వకంగా నేను శిరస్సు వంచుతున్నాను. రాయ్ బరేలి నా కుటుంబం, అమేథి నా ఇల్లు. ఈ రెండు స్థానాలలోని ప్రజలతో నాకు సంబంధం ఉంది. ఈ సంబంధం పవిత్ర గంగమ్మ వంటిది. రాయ్ బరేలిలో ఇందిరా గాంధీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నేను ఇందిరమ్మ బాటలో నా పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పెంచాను. రాయ్ బరేలి నాకు అందరినీ గౌరవించమని నేర్పింది. బలహీనులను రక్షించమంది. న్యాయం కోసం పోరాడమంది…’’ అంటూ సోనియా ప్రసంగించారు. ‘‘ నేను నా కుమారుడు రాహుల్ గాంధీని మీకు అప్పజెప్పుతున్నాను. అతడు మిమ్మల్ని నిరాశ పరచడు’’ అన్నారు.

Sonia Gandhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News