Saturday, December 21, 2024

పుణెలో టగ్ ట్రక్కును ఢీకొన్న విమానం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయంలో ఢిల్లీ బయల్దేరడానికి టేకాఫ్ చేసేందుకు రన్‌వే వైపు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ఒక టగ్ ట్రక్కును ఢీకొంది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. టగ్ ట్రక్కు ఢీకొన్న కారణంగా విమానం ముందు భాగంతోపాటు టైరు సమీపంలో స్వల్పంగా దెబ్బతింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ప్రయాణికులను కిందకు దింపివేసి వేరే విమానంలో వారిని ఢిల్లీకి పంపించినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పౌరవిమాన యాన డైరెక్టరేట్ జనరల్(డిజిసిఎ) దర్యాప్తు ప్రారంభించింది. విమానాన్ని సర్వీసు నుంచి తప్పించి మరమ్మతులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. మరమ్మతుల అనంతరం విమానాన్ని సర్వీసు కోసం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News