Monday, December 23, 2024

నేడు కేబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకా శం ఉంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినేట్ సమావేశం జరుగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలు, తెలంగాణ, ఎపిల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్ లో చర్చించనున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో నే వివిధ శాఖలు అధికారులు పలు అంశాలపై ని వేదికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు జరిగే కేబినేట్‌లో ఎపి, తెలంగాణ విభజన వివాదాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం పెంపు మార్గాలపై సమావేశంలో చర్చించనుంది.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదికపై చర్చించి, మరమ్మతులు, తదుపరి కా ర్యచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. కొత్త విద్యా సంవత్సరం సన్నాహాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరుగనున్నట్టుగా తె లిసింది. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని వందకుపైగా ఆస్తుల విభజన, హైదరాబాద్‌లో ఎపికి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ నేడు కేబినెట్ ముందు పెట్టనుంది. ఎపితో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

రుణమాఫీ నిధుల సమీకరణపై….
రైతు రుణమాఫీపై కూడా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇటీవల ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీ ఇచ్చినందున, ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సిఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు రూ.32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంతో పాటు దానికి సంబంధించి విధి, విధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది.

ధాన్యం కొనుగోళ్లపై కూడా….
ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్ సమీక్షించనున్నట్టుగా తెలిసింది. ధాన్యం సేకరణ వేగం పెంచడానికి అవసరమైన ప్రణాళిక, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం వంటివి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్‌లో చర్చ జరుగనున్నట్టుగా తెలిసింది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

వివిధ అంశాలపై అధికారుల నివేదికలు సిద్ధం
కొత్త విద్యా సంవత్సరం సన్నాహాలపై మంత్రివర్గంలో చర్చకు అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలపై చర్చించి మరమ్మతులపై ఏం చేయాలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యునిఫాంల పంపిణీ, విద్యా సంస్థల్లో వసతులపై చర్చించనున్నారు. పాఠశాల, కళాశాల, ఉన్నత విద్యా శాఖలు, ఇంటర్ బోర్డు వివిధ అంశాలపై నివేదికలు సిద్ధం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News