Tuesday, December 24, 2024

బిగ్ మూవీ టైటిల్ ‘డ్రాగన్’?

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం దేవర. భారీ అంచనాలున్న ఈ సినిమా నుంచి ఈనెల 19న ఫస్ట్ సింగిల్ రాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత తారక్… కెజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి డ్రాగన్ అనే ఆసక్తికర, పవర్‌ఫుల్ టైటిల్ ని లాక్ చేసినట్టుగా సమాచారం.

మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమాతో బిజీగా ఉండగా ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయ్యాక వీరి డ్రాగన్ సినిమా మొదలు కానుంది. ఇక ఈ భారీ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించనుండగా ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News