- Advertisement -
ఛండీగఢ్: కదులుతున్న బస్సులో మంటలు అంటుకోవడంతో 9 మంది సజీవ దహనమైన సంఘటన హర్యానాలోని కెఎంపి ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగింది. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం…. ప్రవేటు బస్సు 60 మంది ప్రయాణికులతో ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నుంచి పంజాబ్‌లోని జలంధర్‌కు వెళ్తోంది. హర్యానాలోని కెఎంపి ఎక్స్‌ప్రెస్ హైవే పైకి రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. చూస్తుండగా మంటల్లో 9 మంది సజీవ దహనం కాగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగిందిన పోలీసుల వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిని వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -