Saturday, December 21, 2024

ఉచిత బస్సు ప్రయాణం మోడీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో మెట్రో ప్రయాణించే మహిళలు తగ్గిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోడీ వ్యాఖ్యలపై పొన్న ప్రభాకర్ రీకౌంటర్ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇంకా కొత్త బస్సులు తీసుకొచ్చిఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు.

కొన్ని రాష్ట్రాలలో అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వివరించారు. ఆర్‌టిసిలో ప్రయాణానికి, మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని, ఇప్పటికే మెట్రో భోగీలు పెంచమని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రధాని మోడీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ చురకలంటించారు. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదని హితువు పలికారు. చిన్న చిన్న అంశాలపై మోడీ మాట్లాడి ప్రధాని లాంటి పదవి స్థాయిని తగ్గించుకోవద్దని పొన్నం ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News