Sunday, November 24, 2024

టూరిస్టు బస్సులో మంటలు..తొమ్మండుగురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

యాత్రికులతో పంజాబ్‌కు తిరిగివస్తున్న టూరిస్టు బస్సులో మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో తొమ్మండుగురు సజీవ దహనం చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. హర్యానాలోని తౌరూ వద్ద కుండ్లీ మనేసర్ పాల్వాల్(కెఎంపి) రహదారిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బస్సులోని వారంతా నిద్రలో ఉండగానే మంటలు చేలరేగడంతో ఈ యాత్రికులు విలవిలలాడారు. 24 మంది వరకూ అత్యధిక శాతం ఒళ్లుకాలి ఆసుపత్రుల పాలుకావల్సి వచ్చింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన వారు ఎక్కువగా బంధువులు ఉత్తరప్రదేశ్‌లోని మథుర, బృందావన్ యాత్రకు వెళ్లి బస్సులో స్వస్థలానికి వెళ్లుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. పిల్లలతో సహా ఈ బస్సులో 60 మందికి పైగా ఉన్నారని వెల్లడైంది.

పెద్ద ఎత్తున మంటలతో బస్సు దూసుకువెళ్లడం గమనించి పొలాలకు వెళ్లుతున్న స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక దళాలకు విషయం తెలిపారు. ఓ వ్యక్తి తనకు బస్సు డ్రైవర్ ఫోన్ నెంబరు తెలిసి ఉండటంతో నిలిపివేసేందుకు ఆయనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. అయితే బస్సు ఆగలేదని, దీనితో బస్సును తాను బైక్‌పై చాలా దూరం వెంబడించి డ్రైవర్‌ను హెచ్చరించానని , బస్సు ఆగేలోగానే బస్సులో అంతటా మంటలు విస్తరించుకుపొయ్యాయని ఈ స్థానిక వ్యక్తి తెలిపారు. ఇదే దశలో అక్కడికి పోలీసు, అగ్నిమాపక శకటాలు తరలిరావడం, వీరు కష్టపడి మంటలను అదుపులో పెట్టేలోగానే లోపలున్న వారిలో ఎనమండుగురు మంటల్లో మసికాగా , మరో వ్యక్తిని బయటకు తీసుకువచ్చే దశలో చనిపోయ్యాడని వెల్లడైంది. గాయపడ్డ పలువురిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణం తెలియలేదని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని తౌరూ సదర్ పోలీసుస్టేషన్ అధికారి జితేందర కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News