Monday, December 23, 2024

చెన్నై సూప‌ర్ కింగ్స్ లక్ష్యం 219

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (47), డుప్లెసిస్ (54) జట్టుకు శుభారంభం అందించారు. కోహ్లి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు రజత్ పటిదార్ 23 బంతులలో 4 సిక్సర్లు, రెండు ఫోర్లతో 41 పరుగులు సాధించాడు. దూకుడుగా ఆడిన కామెరూన్ గ్రీన్ 17 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో అజేయంగా 38 పరుగులు చేశాడు. దినేశ్ కార్తీక్ (14), గ్లెన్ మాక్స్‌వెల్ (16)లు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. దీంతో బెంగళూరు భారీ స్కోరును నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News