Monday, November 18, 2024

అబ్బాయిల హవా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎప్‌సెట్‌లో అబ్బాయిలు ర్యాంకుల పంట పండించారు. ఇంజనీరింగ్‌లో టాప్-10 ర్యాంకుల్లో 10కి 9 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. అగ్రికల్చర్ టాప్ టెన్ ర్యాంకుల్లోనూ ఏడింటిని కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10లో ఒకే ఒక అమ్మాయి నిలవడం వి శేషం. మొదటి పది ర్యాంకుల్లో 9 ర్యాంకులు అబ్బాయిలే కైవసం చేసుకోగా, టాప్ 10 ర్యాంకులో ధనుకొండ శ్రీనిధి ఒకరుగా నిలిచా రు. అలాగే అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో టా ప్ 1,3,10 ర్యాంకులు అమ్మాయిలు కైవసం చేసుకున్నా రు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంశనివారం జెఎన్‌టియుహెచ్‌లో ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేశా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లిం బాద్రి, జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నర్సింహ్మారెడ్డి, ఎప్‌సెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఉ న్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వి. వెంకట రమణ, ఎస్‌కె మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పా ల్గొన్నారు. ఈ సారి ఇంజనీరింగ్‌లో 74.98 శా తం ఉత్తీర్ణత నమో దు కాగా, అగ్రికల్చర్ ఎంసెట్‌లో 89.66 శా తం ఉత్తీర్ణత నమోదైంది.

ఈనె ల 7 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరగ గా, 7,8 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, 9,10,11 తేదీలలో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ ఎప్‌సెట్ పరీక్షకు 2,54,750 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2,40,618 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 1,80,424 మంది విద్యార్థులు (74.98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మా ఎప్‌సెట్‌కు 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా, 91,633 మంది హాజరయ్యారు. అందులో 82,163 మంది(89.66 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో ఎప్‌సెట్‌లో ఎపి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా, ఎపి కర్నూల్ జిల్లాకు చెందిన గొల్ల లేఖ హర్ష రెండో ర్యాంకు సాధించారు. సికింద్రాబాద్‌కు చెందిన రిషి శేఖర్ శుక్లా మూడో ర్యాంకు, మాదాపూర్‌కు చెందిన భోగలపల్లి సందేష్ నాలుగో ర్యాంకు, ఎపి కర్నూల్‌కు చెందిన మురసాని సాయి యశ్వనాధ్‌రెడ్డి ఐదవ ర్యాంకు సాధించారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో ఎపి అన్నమయ్య జిల్లాకు చెందిన ఆలూర్ ప్రణీత మొదటి ర్యాంకు పొందగా, ఎపి విజయనగరం జిల్లాకు చెందిన ఎన్.రాధాకృష్ణ రెండో ర్యాంకు, వరంగల్ జిల్లాకు చెందిన గడ్డం శ్రీవర్షిని మూడో ర్యాంకు, ఎపి చిత్తూరు జిల్లాకు చెందిన సొంపల్లి సాకేత్ రాఘవ్ నాలుగో ర్యాంకు, గోల్కొండ అసిఫ్ నగర్‌కు చెందిన రేపాల సాయి వివేక్‌కు ఐదవ ర్యాంకు లభించింది.

ఫలితాలను చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు : బుర్రా వెంకటేశం
ఎప్‌సెట్‌కు గత పదిసంత్సరాల్లో లేనతంగా విద్యార్థులు ఈసారి దరఖాస్తు చేసుకున్నారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. గతంలో ఒక్కో షిఫ్ట్‌లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారని, కానీ ఇప్పుడు ఒక్కో షిఫ్ట్‌లో 50 వేల మంది పరీక్ష రాసినట్లు వివరించారు. ఫలితాలను చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇంజినీరింగ్‌లో తొలి పది ర్యాంకుల్లో తొమ్మిదింటిని బాలురు కైవసం చేసుకున్నారని అన్నారు. ఇందులో మొదటి రెండు ర్యాంకులు ఎపి విద్యార్థులకు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన అందరికీ ఇంజినీరింగ్ విభాగంలో సీట్లు వస్తాయని తెలిపారు. వారం రోజుల్లోనే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ వేరిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలతో సమర్ధంగా పనిచేసిన అధికారులను బుర్రా వెంకటేశం ప్రశంసించారు. గతంలో ఎంసెట్ నిర్వహించే పరీక్షను మొదటిసారి ఇఎపిసెట్ పేరుతో నిర్వహించామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

ఇంజనీరింగ్ ఎప్‌సెట్ టాప్ 10 ర్యాంకర్లు
మొదటి ర్యాంకు- ఎస్.జ్యోతిరాదిత్య(ఎపి, శ్రీకాకుళం- పాలకొండ)
రెండో ర్యాంకు- హర్ష(ఎపి, కర్నూలు -పంచలింగాలు)
మూడో ర్యాంక్ -రిషి శేఖర్ శుక్లా(సికింద్రాబాద్- తిరుమలగిరి)
నాలుగో ర్యాంకు -సందేశ్(హైదరాబాద్ -మాదాపూర్)
ఐదో ర్యాంకు-సాయి యశ్వంత్ రెడ్డి(ఎపి, కర్నూలు)
ఆరో ర్యాంకు- పుట్టి కుశల్ కుమార్(ఎపి, అనంతపురం- ఆర్కేనగర్)
ఏడో ర్యాంకు- హుండికర్ విదీత్(హైదరాబాద్ -పుప్పాలగూడ)
ఎనిమిదో ర్యాంకు-రోహన్(హైదరాబాద్- ఎల్లారెడ్డిగూడ)
తొమ్మిదో ర్యాంకు-కొంతేమ్ మణితేజ(వరంగల్- ఘన్‌పూర్)
పదో ర్యాంకు- ధనుకొండ శ్రీనిధి(ఎపి, విజయనగరం)

అగ్రికల్చర్,ఫార్మా ఎప్‌సెట్ టాప్ 10 ర్యాంకర్లు

మొదటి ర్యాంకు-ప్రణీత(ఎపి, మదనపల్లె)
రెండో ర్యాంకు-రాధాకృష్ణ(ఎపి, విజయనగరం)
మూడో ర్యాంకు-శ్రీవర్షిణి(హనుమకొండ)
నాలుగో ర్యాంకు-సాకేత్ రాఘవ్(ఎపి, చిత్తూరు)
ఐదో ర్యాంకు- సాయి వివేక్(హైదరాబాద్- ఆసిఫ్‌నగర్)
ఆరో ర్యాంకు -మహమ్మద్ అజాన్‌సాద్(హైదరాబాద్- నాచారం)
ఏడో ర్యాంకు -వడ్లపూడి ముకేశ్ చౌదరి(ఎపి,తిరుపతి -వెంగమాంబపురం)
ఎనిమిదో ర్యాంకు- భార్గవ్ సుమంత్(హైదరాబాద్ -పేట్‌బషీరాబాద్)
తొమ్మిదో ర్యాంకు-జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్ -అల్విన్ కాలనీ)
పదో ర్యాంకు- దివ్యతేజ(ఎపి, శ్రీసత్యసాయి జిల్లా- బలిజపేట)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News