Monday, December 23, 2024

ఖర్గే చెప్పినా బెంగాల్ సీఎంపై నా పోరు ఆగదు : అధీర్ రంజన్

- Advertisement -
- Advertisement -

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. “ ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్ ఉపయోగపడాలని నేను అనుకోవడం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యతిరేకించినా,

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా, ముఖ్యమంత్రి మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా ” అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు. అధీర్ రంజన్ వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. “ మమతా బెనర్జీ కూటమి లోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. అధీర్ రంజన్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోలేరు. కీలక నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడుగా, నేను , పార్టీ అధిష్ఠానం మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు” అని ఖర్గే స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News