మధ్య గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 27 మంది వ్యక్తులు హతమయ్యారు. వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఆదివారం ఉత్తరంగా హమాస్‌తో పోరు ఉద్ధృతమైంది. మరొక వైపు హమాస్‌తో యుద్ధం ఎనిమిదవ నెలలోకి ప్రవేశించగా గాజా పాలన ఎవరిది అనే అంశంపై ఇజ్రాయెలీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన యుద్ధ క్యాబినెట్‌లోని ఇద్దరు సభ్యుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బెన్నీ గాంట్జ్ ప్రధానికి హెచ్చరిక చేశారు. యుద్ధానంతరం గాజాపై అంతర్జాతీయ పాలన యంత్రాంగాన్ని చేరుస్తూ జూన్ 8 నాటికి ఒక ప్రణాళికను రూపొందించకపోతే ప్రభుత్వాన్ని వీడతానని గాంట్జ్ బెదరించారు. ఇజ్రాయెల్‌ను గుర్తించేందుకు, తుదకు పూర్తి దేశ హోదాకు వీలు కల్పిస్తూ గాజాపై పాలనకు పాలస్తీనా ప్రభుత్వానికి సాయం చేసేందుకు సౌదీ అరేబియా కోసం ఆశావహ యుఎస్ ప్రణాళికపై చర్చ నిమిత్తం అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు జేక్ సుల్లివాన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును, ఇతర నేతలను కలుసుకోవచ్చు.