Monday, November 18, 2024

తిరుమలలో బారులు తీరిన భక్తులు

- Advertisement -
- Advertisement -

ఏడుకొండలపైన కొలువు తీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో, ప్రస్తుతం వర్షాలు పడి వాతావరణం చల్లబడడంతో, అంతేకాదు వారాంతం నేపథ్యంలో తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక భక్తులు రోడ్లపై మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారు. శనివారమే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగగా ఆదివారం నాడు ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్ లతోపాటు రింగు రోడ్డు మీదుగా అక్టోపస్ భవనం వరకు మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరి ఎదురుచూస్తున్నారు. ఇక తిరుమలకు భక్తుల రద్దీ పెరగడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ టిటిడి చర్యలు చేపట్టింది.

మరికొన్ని రోజుల పాటు వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతుందని టిటిడి భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం జెఇఒ వీరబ్రహ్మం, తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతున్న రద్దీ నేపథ్యంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలని భావించేవారు తిరుమలకు ఇప్పుడు వస్తే ఇబ్బంది పడతారని ఈ విషయాన్ని భక్తులందరూ గమనించాలని చెబుతున్నారు. కాస్త రద్దీ తగ్గాక తిరుమలకు రావటానికి ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే నిన్నటికి శనివారం తిరుమలలో 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 43 వేల 1999 మంది తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు కాగా, శనివారం క్యూ కాంప్లెక్స్ లు అన్ని నిండిపోయి, శిలాతోరణం వరకు భక్తులు దర్శించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. శనివారం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టిందని టిటిడి అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News