టెహారాన్/ దుబాయ్ : ఇరాన్ దేశాధ్యక్షులు ఇబ్ర హీం రైసీ , విదేశాంగ మంత్రి హోస్సెయిన్ అమిరబ్దోల్లహిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివా రం అజర్‌బైజాన్ లోతట్టు దుర్భేధ్య పర్వతాల న డుమ కుప్పకూలింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం నడుమ ఈ హెలికాప్టర్ పరిస్థి తి ఏమిటీ? ఇందులోని ఈ ప్రముఖుల యోగక్షేమా లేమిటీ? అనేవి తెలియరాలేదు. దీనితో ప్ర పంచవ్యాప్తంగా ఈ ఘటనపై ఉత్కంఠత నెలకొం ది. అజర్‌బైజన్ సరిహద్దులలో ఓ అధికారిక పర్యటనకు వెళ్లి వీరు టెహారాన్‌కు బయలుదేరి వస్తుండగా హెలికాప్టర్ అంతుచిక్కని రీతిలో కన్పించకుండా పోయింది. ఇది కుప్పకూలి ఉంటుందని ఆ తరువాత వార్తలు వెలువడ్డాయి. ఈ హెలికాప్టర్‌లో ఈ ఇద్దరితో ప్రాంతీయ గవర్నర్, ఒకరిద్దరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని ప్రాధమిక వార్తలు తెలిపాయి. అయితే విమాన ప్రమాదం వార్తలు అదికారికంగా నిర్థారణ కాలేదు . ముందు వెలువడ్డ వార్తలలో హెలికాప్టర్ అత్యంత క్లిష్టతర పరిస్థితిలో రఫ్ ల్యాండింగ్ అయిందని పేర్కొన్నారు. ఈ లోగానే ఇరాన్ అధికారిక టీవీ ఛానల్స్‌లో రోజువారి నిర్ణీత కార్యక్రమాలను కొద్ది సేపు నిలిపివేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో దేశాధ్యక్షుడి క్షేమానికి ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిపే ఫోటోలను చూపారు. నేపథ్యంలో ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా నిశ్శబ్ధం పాటించారు.
ఇదే క్రమంలో స్క్రీన్‌పై విడిగా హెలికాప్టర్ కోసం పెద్ద ఎత్తున గాలింపులు చేపడుతున్న బృందాలు, దట్టమైన పొగమంచు మధ్య సహాయక బృందాలు కాలినడకన సాగుతున్న దృశ్యాలను పొందుపర్చారు. హెలికాప్టర్ పతనం చెందిందని పేర్కొన్నారు కానీ ఇరువురు నేతల పరిస్థితి ఏమిటనేది వార్తలలో తెలియచేయలేదు. వీరు సజీవంగానే ఉన్నారని తాము ఆశతో ఉన్నామని, అయితే ఘటన స్థలం , నెలకొని ఉన్న భీకర ప్రతికూల వాతావరణం నడుమ అందుతున్న వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయని ఓ అధికారి తన పేరు చెప్పకుండా తెలిపారు. చిమ్మచీకట్లు, ఎతైన కొండప్రాంతం కావడంతో వెంటనే సహాయక చర్యలను వేగిరపర్చలేకపోతున్నారని అధికారిక వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం, మరో వైపు ఇప్పటికీ వీడని గాజా సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ పతనం ఈ ప్రాంతంలో పరిస్థితిని మరింత దిగజార్చేలా మారింది. 63 సంవత్సరాల రైసీ 2021లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులు అయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో నైతిక నియమావళి చట్టాలను మరింత కటుతరం చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలపై ఉక్కుపాదం మోపారు. ప్రపంచ శక్తివంత దేశాలతో అణుచర్చలలో తన పట్టు వీడలేదు. ఇరాన్‌లోని ద్వంద రాజకీయ వ్యవస్థల క్రమంలో అధికారాలు ఇరాన్ ఇస్లామిక్ మతపెద్దలు, ఎన్నికైన ప్రభుత్వం మధ్య కేంద్రీకృతం అయి సాగుతాయి. అయితే ఇరాన్ మత సుప్రీం పెద్దనే దేశాధ్యక్షుడితో పోలిస్తే అత్యధిక విశేషాధికారాలు సంక్రమించుకుని ఉంటాడు. సుప్రీం లీడర్‌గా ఇప్పుడు 85 సంవత్సరాల అయతోల్లా అలీ ఖమేనీ అధికారం సాగుతోంది. ఈ క్రమంలో సాగుతున్న ఇరాన్ అంతర్గత వ్యవహారాలు, పలు అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇప్పటి హెలికాప్టర్ పతనం, దీనిపై ఇప్పటికీ నిర్థారణకు రాని వార్తలు పరిస్థితిని సంక్లిష్టం చేశాయి. కాగా దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి అహ్మద్ వాహిది అధికారిక టీవీలో మాట్లాడుతూ మూడు హెలికాప్టర్లు ఈ ప్రాంతంలో వెళ్లగా ఇందులో ఒకటి పతనం చెందినట్లు తెలిసిందని, కాగా అధికారులు దీని గురించి పూర్తి సమాచారం నిర్థారించుకుంటున్నారని వివరించారు. దేశాధ్యక్షులు తమ మంత్రితో కలిసి అజర్‌బైజన్ ప్రాంతంలోసంయుక్తంగా చేపట్టిన కిజ్ ఖాలాయిసి డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది.