- Advertisement -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవితన ఈడీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఆమెకు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఈరోజుతో కస్టడీ ముగియనుండడంతో అధికారులు ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసింది.
- Advertisement -