- Advertisement -
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తులం బంగారం ధర ఇప్పటికే రూ.75వేలకు చేరుకుంది. మరోవైపు వెండి కూడా లక్ష రూపాయల వైపు దూసుకుపోతోంది. దీంతో ఇలా పెరుగుకుంటూ పోతే సామాన్య జనాలు బంగారం కొనేదెట్లా అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 540 రూపాయలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో గ్రాము 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.68,900కు చేరుకుంది. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.75,160గా ఉంది. కిలో వెండి ధర రూ.96,000గా కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఉన్న ధరలే విజయవాడలో ఉన్నాయి.
- Advertisement -