- Advertisement -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. సోమవారంతో జుడీషియల్ కస్టడీ ముగియడంతో అధికారులు.. ఆమెను కోర్టులో హాజరపర్చారు.
ఈడీ, సిబిఐ కేసుల్లో కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు జూన్ 3వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 15న కవితన ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -