Friday, December 20, 2024

అహ్మదాబాద్‌లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

గుజరాత్ పోలీసులు సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఆ నలుగురు ఉగ్రవాదులూ శ్రీలంక జాతీయులని, యూదులకు ముఖ్యమైన ప్రదేశాలు లక్షంగా దాడులు చేయాలని వారిని కోరారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ఐసిస్ ఉగ్రవాదులు మొదట కొలంబో నుంచి చెన్నై వచ్చినట్లు, తరువాత వారు అహ్మదాబాద్ చేరినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయంలో తమ పాకిస్తానీ బాధ్యుల నుంచి ఒక సందేశం కోసం వారు నిరీక్షిస్తుండగా గుజరాత్ పోలీస్ ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) వారిని పట్టుకున్నదని ఆ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాదుల దగ్గర నుంచి కొన్ని పాకిస్తానీ తయారీ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్‌లో గుజరాత్ ఎటిఎస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 602 కోట్లు విలువ చేసే 86 కిలోల నిషిద్ధ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. అంతకు ముందు ఎన్‌సిబి గుజరాత్, రాజస్థాన్‌లో ‘మ్యూవ్ మ్యూవ్’గా పేర్కొనే నిషిద్ధ డ్రగ్ మెఫెడ్రోన్‌ను తయారుచేసే మూడు ల్యాబ్‌ల గుట్టు రట్టు చేసింది. ఎన్‌సిబి ఆ సందర్భంగా ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News