Friday, December 20, 2024

రేపు దేశవ్యాప్తంగా సంతాపం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరనించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్ అబ్దుల్లాహియాన్‌కు భారత ప్రభుత్వం ఒకరోజు సంతాపాన్ని ప్రకటించింది. మే 21న దేశవ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. అధికారిక వినోద కార్యక్రమాలేవీ జగరవని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధాని మోడీ సంతాపం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఇరాన్‌కు భారత్ అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షడు ఇబ్రహిం రైసీ మృతి చెందడం పట్ల ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సబంధాల బలోపేతానికి రైసీ చేసిన కృషిని ఎన్నడూ మరువలేమని ఆయన పేర్కొన్నారు. రైసీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మోడీ ఈ విషాద సమయంలో ఇరాన్ కు బాసటగా నిలుస్తామని మోడీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News