Tuesday, November 5, 2024

నాలుగు నెలలుగా 4000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు లేవు: హరీష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. నాలుగు నెలలు నుంచి వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని, ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు.

దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని చురకలంటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News