Friday, December 20, 2024

బిజెపి అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ ఒక్క రోజు ప్రచారంపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చౌకబారు వ్యాఖ్యలు చేసినందుకుగాను ఎన్నికల సంఘం బిజెపి అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయను 24 గంటలపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆంక్ష విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వు ప్రతిని బిజెపి చీఫ్ నడ్డాకు కూడా పంపారు. ఇదివరలో ఉల్లంఘించిన మాదిరిగానే మళ్లీ గంగోపాధ్యాయ ఉల్లంఘించారని ఈసి పేర్కొంది. మహిళల గౌరవాన్ని, హుందాతనానికి భంగం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించినప్పటికీ అభిజిత్ గంగోపాధ్యాయ దానిని పదేపదే ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది.

అభిజిత్ గంగోపాధ్యాయ ఇటీవల కోల్కతా హైకోర్టు జడ్జీ పదవికి రాజీనామా చేసి, బిజెపిలో చేరారు. పైగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన మే 15న హాల్దియాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యం చేసుకున్నారు. ఆమె అసలు ఆడదేనా అన్నట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉండినాయి. ఈసి దీనిని మహిళా గౌరవంపై ప్రత్యక్ష దాడిగా పరిగణించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News