Monday, December 23, 2024

ఢిల్లీలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్

- Advertisement -
- Advertisement -

9 మంది పట్టివేత

ఢిల్లీ: స్టాక్ మార్కెట్ నిపుణులమంటూ నమ్మించి నలుగురు వ్యక్తులను మోసగించి దాదాపు రూ. 2.38 కోట్లను స్వాహా చేసిన తొమ్మిది మంది ఉన్న గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. సైబర్ మోసగాళ్లయిన వీరి ఆటను ఢిల్లీ పోలీసులు దెబ్బతీశారు.  మంచి లాభాలొస్తాయని నమ్మించి ఈ మోసగాళ్లు జనాలను మభ్యపెడతారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన ఉత్తమ్ నగర్ నివాసి విశాల్ సోధిని జనవరి 17న మోసం చేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రేడింగ్ యాప్ తో తనను రూ. 60 లక్షల వరకు ముంచేశారని అతడు పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ఆ మోసగాళ్ల వలలో చాలా మంది పడ్డారని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

బాధితుడి కథనం ప్రకారం వారు వాట్సాప్ గ్రూప్ లో ఆన్ లైన్ టుటోరియల్ క్లాస్ కోసం తనను యాడ్ చేసుకున్నారని, అధిక లాభాలొస్తాయని నమ్మించారని తెలిపారు. మోసగాళ్లు  అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టమని నమ్మించారని, బాధితుల నుంచి డబ్బు సేకరించడానికి వివిధ బెనిఫియరీ అకౌంట్లు తెరిపించారని పోలీసులు వివరించారు.

ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ నేతృత్వంలో అధికారుల స్పెషల్ టీమ్ సాంకేతిక నిఘా, డిజిటల్ ట్రాకింగ్ ద్వారా మునీశ్ శర్మ(37)ను అరెస్టు చేసింది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంజీవ్ కుమార్ పర్యవేక్షణలో అతడిని పట్టుకున్నారు. అతడు సెల్ ఫోన్, జిమెయిల్ ద్వారా మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రశ్నించినప్పుడు శర్మ తనతో పాటు మరో ఎనిమిది మంది ఉన్నట్లు తెలిపాడు. శర్మ, గౌరవ్ కుమార్(34), వికాస్ బన్సల్ (52), తుషార్ గర్గ్(30) బక్రా వంటి వారిని ప్రలోభానికి గురిచేసి పట్టుకునేవారు.

‘‘ వారు బాధితుల నుంచి ఆధార్, పాన్, కెవైసి పత్రాలను తీసుకుని తమ పేరిట బోగస్ సంస్థలను సృష్టించుకునేవారు…’’ అని డిప్యూటీ కమిషనర్ హేమంత్ తివారీ తెలిపారు. ‘‘బన్సల్ అతడి సహచరులు 400 కు పైగా బోగస్ సంస్థలను, 400 కరెంట్ బ్యాంకు ఖాతాలను తెరచి బాధితుల డబ్బు స్వాహా చేసేవారు’’ అని తివారీ తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News