Friday, December 20, 2024

యూరప్ ట్రిప్ మరింత భారం… షెంజెన్ వీసా ఫీజు పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజు ను 12 శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదించింది. జూన్ 11 నుంచి ఈ పెంపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్ వీసా దరఖాస్తు ధర రూ.80 యూరోలు ఉండగా, ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8 వేలకు పైనే)కు పెంచారు. ఇక, 612 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ద్రవ్యోల్బణం, సివిల్ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు, తదితర కారణాలతో ఈ వీసా ఫీజును పెంచినట్టు యూరోపియన్ కమిషన్ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు.

షెంజెన్ అంటే 29 ఐరోపా దేశాల సమాఖ్య. 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా, షెంజెన్ వీసాలను జారీ చేస్తుంటారు. ఏదైనా షెంజెన్ దేశం ఈ వీసాను జారీ చేస్తే, దానిపై ఇతర షెంజెన్ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తుంది. ఇటలీ, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ నెదర్లాండ్స్ వంటి దేశాలు ఈ పరిధి కిందకు వస్తాయి. తాజా పెంపు నిర్ణయం భారతీయుల పైనా అధిక ప్రభావమే చూపనుంది. ఐరోపాకు వీసా దరఖాస్తుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News