Monday, November 25, 2024

నేడు అల్పపీడనం.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని దీని ప్రభావంతో బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఇంటరీయర్ కర్ణాటక వరకు రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది.

వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లోఅలర్ట్ ప్రకటించింది.
ఖమ్మంలో 35.3మి.మి వర్షం:
రాష్ట్రంలో మంగళవారం నాడు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా తిమ్మారావుపేటలో 35.3 మి. మివర్షం కురిసింది. టేకులపల్లిలో 30.8, ఐజలో 26.8, సటెర్లలో 23.5, మంచుకోండలో 22.3, అంకపాళేంలో 19.8, పంగిడిలో 18.8, పెంట్లంలో 16.8 మి.మి చొప్పున వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి.
మళ్లి పెరిగిన ఉష్ణోగ్రతలు:
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లా అర్లిలో అత్యధికంగా 43.9డిగ్రీలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 43.4,నిజామబాద్ జిల్లాలో 43.4 కొమరంభీమ్ ఆసిపాబాద్‌లో 43.2, నిర్మల్‌లో 42.9, కరీంనగర్‌లో 42.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News