Saturday, December 21, 2024

కోల్ కతాలో శవమైన బంగ్లాదేశ్ ఎంపీ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ చికిత్స కోసం ఇండియా వచ్చారు.

ఢాక: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ ఇండియాలో కనిపించకుండా పోయాడు. తర్వాత కోల్ కతాలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ముగ్గుని అరెస్టు చేసినట్లు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ బుధవారం ప్రకటించారు.

హత్యకు గురైన అన్వరుల్ అవామీ లీగ్ ఎంపీ. ఆయన కోల్ కతాలోని ఓ ఫ్లాట్ లో హత్యకు గురయ్యాడు. హత్యకు పాల్పడ్డ వారు బంగ్లాదేశీయులని అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు. ఓ ప్లాన్ తోనే ఈ హత్య జరిగిందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ పోలీసులు ముగ్గుని అరెస్టు చేసినట్లు ‘ది డైలీ స్టార్’ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News