Tuesday, December 24, 2024

పుణె టీన్ డ్రైవర్ బెయిల్ రద్దు

- Advertisement -
- Advertisement -

పుణెలో ఒక బార్‌లో మద్యం సేవించిన తరువాత తన పోర్షె కారుతో ఢీకొట్టి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమయ్యాడనే ఆరోపణకు గురైన 17 ఏళ్ల బాలునికి మంజూరు చేసిన బెయిల్‌ను జస్టిస్ జువెనైల్ బోర్డు బుధవారం రద్దు చేసింది.ఆ మైనర్‌ను బాలల పరిశీలన కేంద్రం (సిఒసి)కి పంపవలసి ఉంటుందని బోర్డు సూచించింది. నేరం ఆధారంగా ఆ మైనర్ నిందితుని ప్రాసిక్యూషన్ సమయంలో ఒక వయోజనుడుగా పరిగణించాలని పుణె పోలీసులు డిమాండ్ చేశారు.

అయితే, తదుపరి దర్యాప్తు ప్రకారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వారు తెలిపారు. పుణెలో తన పోర్షె కారుతో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు ఐటి ప్రొఫెషనల్స్‌ను ఢీకొని వారి మరణానికి కారణమైన 17 ఏళ్ల బాలుని 25 ఏళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా నిషేధించనున్నట్లు మహారాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్‌వర్ బుధవారం తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News