Saturday, December 21, 2024

పదేళ్లయినా విభజన అసంపూర్ణమే!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజ న జరిగి పదేళ్లు పూర్తి కావస్తోంది. దశాబ్ది ఉ త్సవాలకు కూడా రంగం సిద్ధమవుతోంది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉ మ్మ డి రాజధానిగా ఉన్న హైదరాబాదు ఇక పూ ర్తిస్థాయిలో తెలంగాణా రాజధానిగా అవతరించబోతోంది. జూన్ 2 తరవాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లోని సెక్షన్ 8 కూడా ఉనికిని కోల్పోతుంది. అవన్నీ ఒకె త్తు ఆస్తుల విభజన మరొకెత్తు అన్నట్లు, దా యాదుల మధ్య వివాదాస్పద అంశాలు మా త్రం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లే దు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన రోజురోజుకీ జఠిలమవుతోంది.. చివరికి పం చాయితీ కోర్టుకు ఎక్కిన విషయం విదితమే. రెండు రాష్ట్రాల మ ధ్య ఆస్తుల విభజనకు మధ్యవర్తిని నియమించాలని ఎపి కోరుతుంటే, అక్కరలేదని తెలంగా ణా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులోవాదిస్తున్నాయి.దశాబ్దం తరవాత కూ డా దాయాదుల మధ్య షెడ్యూల్ 9, 10 సం స్థల విభజన చిచ్చు రగులుతూనే ఉంది. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 32 సార్లు, రెండు రాష్ట్రాల అధికారులు అనేకసార్లు కూచుండి చర్చించినా ఫలితం శూన్యం! రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఎక్కడ తరువాయి 10లో
(మొదటిపేజీ తరువాయి)
వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. చట్టంలోని షెడ్యూల్ 9 ప్రకారం మొత్తం 91 సంస్థలు, షెడ్యూల్ 10 లో 142 సంస్థల విభజన జరగాలి. వీటిలో షెడ్యూల్ 9 సంస్థల విభజనపై షీలా భిడే కమిటీ అధ్యయనం చేసి కొన్ని సిఫారసులు చేసింది. సంస్థ కేంద్ర కార్యాలయం ఆధారంగా ఆస్తుల విభజన జరగాలని ప్రతిపాదించింది. కేంద్ర కార్యాలయం అంటే కూడా స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ఐతే, షీలా భిడే కమిటీ సిఫారసుల్లో 23 సంస్థల విభజనపై తెలంగాణా అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం ఉన్న సంస్థలను వదిలేసి, ఏకాభిప్రాయం ఉన్న 68 సంస్థలతో ముందు విభజన ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. తెలంగాణా ఒప్పుకున్నా అందుకు ఎపి ససేమిరా అంటోంది. ఈ పంచాయితీ నడుస్తుండగానే, ఆస్తుల పంపకాల కోసం ఒక మధ్యవర్తిని నియమించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎపి దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ పై తెలంగాణా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు కౌంటర్ దాఖలు చేశాయి. ఆస్తుల విభజన కోసం ఆర్బిట్రేటర్ అక్కరలేదని వాదించాయి. ఇదిలా ఉంటే, షెడ్యూల్ 9 సంస్థల్లో అసలు కిరికిరి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ది.

దీని విభజనకు భారత ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని 2014 పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ఐతే, రాష్ట్ర విభజన సమయానికి ఎస్‌ఎఫ్సీ పాలకమండలిలో అత్యధిక మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్లే ఉన్నారు. కానీ, చట్టంలోని సెక్షన్ 71 ప్రకారం సంస్థలో తెలంగాణాకు సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండింది. దాన్ని బేఖాతరు చేస్తూ సమాన ప్రాతినిధ్యం కల్పించక పొగా షీలా భిడే కమిటీ సిఫార్సులకు భిన్నంగా ఆ సంస్థ చరాస్తులు కూడా పంచాలని కార్పొరేషన్ మెంబర్లు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. ఇదే అంశాన్ని వివరిస్తూ ఆ తరవాత తెలంగాణా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు హైదరాబాద్ నానక్ రాం గూడా, గాజులరామారం గ్రామంలో సుమారు 500 ఎకరాల ఆస్తి ఉంది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.4 వేల కోట్లు ఉంటుంది. ఎస్‌ఎఫ్సీ బోర్డు తీర్మానంతో వేల కోట్ల ఆస్తి ఇరకాటంలో పడింది. ఆ ఆస్తుల పంపకం కుదరదని తెలంగాణా తేల్చి చెప్పింది. ఇక, షెడ్యూల్ 10 ఆస్తులు పంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో ఎక్కడా లేదు.

కానీ, ఈ సంస్థలకు సంబంధించిన నగదు మాత్రం రెండు రాష్ట్రాలు పంచుకోవాలని చట్టంలో ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారశైలి ఇందుకు భిన్నంగా ఉంది. షెడ్యూల్ 10 సంస్థల ఆస్తులు కూడా పంచి తీరాల్సిందే అని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 142 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉండాలని నిర్ణయిస్తూ 2017 మే నెలలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఐనా, మొండి వైఖరి వీడకుండా ఆంధ్రప్రదేశ్ ఈ వ్యవహారంపై కోర్టు మెట్లు ఎక్కింది. విభజన చట్టానికి మేం కట్టుబడి ఉన్నాం అని ఇటు తెలంగాణా, చట్ట ప్రకారం షెడ్యూల్ 10 ఆస్తుల విభజన కుదరదని అటు ఎంహెచ్‌ఏ ఇరు పక్షాలూ కోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. విభజన జరిగి దశాబ్దం కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఆస్తుల విభజన ఒక కొలిక్కి రావడం లేదు. అదెప్పటికి జరుగుతుందో అనే స్పష్టత కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ తన మొండివైఖరిని వీడనంత వరకూ ఏళ్లు గడచినా అవి అపరిష్కృతంగానే ఉంటాయనేది అధికారుల వెర్షన్‌గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News