ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు దినేశ్ కార్తీక్ గుడ్ బై చెప్పాడు. ఐపిఎల్ లో భాగంగా బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్.. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పినట్లు భావిస్తున్నారు.
మ్యాచ్ తర్వాత మైదానం నుంచి డగౌట్‌కు వెళ్తూ.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ చప్పట్లు కొడుతూ డీకే డీకే అంటూ వీడ్కోలు పలికారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కార్తీక్ ఐపిఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సీజన్ లో అద్భుత ఫామ్ తో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కార్తీక్.. 15 మ్యాచ్‌ల్లో 326 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో 2008 ఎడిషన్ నుంచి ఆడుతున్న దినేశ్ కార్తిక్.. ఇప్పటివరకు 257 మ్యాచ్‌లు ఆడిన.. 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు కార్తీక్ ప్రాతినిధ్యం వహించారు.
కాగా, నిన్న రాజస్థాన్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి క్వాలిఫైయర్ 2కు దూసుకెళ్లింది. దీంతో బెంగళూరు టోర్నీ నుంచి వైదొలింది. ఇక, రేపు చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.
Dinesh Karthik getting guard of honour from RCB and the crowd chanting 'DK, DK'.
– The most emotional video. 🥹💔 pic.twitter.com/XZ3WmbO5Ne
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2024
Heart-breaking video….!!! 💔
– Thank you, DK for all memories in IPL. pic.twitter.com/qBajRBZXQi
— Johns. (@CricCrazyJohns) May 22, 2024