భారతదేశపు ఎలెక్ట్రిక్ మొబిలిటి, ఎనర్జీ ల్యాండ్‌స్కేప్ లో మార్గదర్శక శక్తి అయిన మాటర్, ఒక ఎమర్జింగ్ ప్లేయర్ గా తన స్థానాన్ని పటిష్ఠ చేసుకుంటూ, ఆటోమోటివ్ విభాగములో క్లారివేట్ దక్షిణాసియా ఇన్నొవేషన్ అవార్డ్స్ 2024 గెలుచుకోవడం గురించి గర్వంగా ప్రకటించింది. విశ్వసనీయమైన అంతర్దృష్టులు మరియు విశ్లేషణలను అందించడములో ప్రపంచ నేత అయిన క్లారివేట్ ద్వారా అందించబడిన ఈ గౌరవప్రదమైన ప్రశంసలు, శుభ్రమైన శక్తి & మొబిలిటి పరిష్కారాల రంగములో ఆవిష్కరణ మరియు సాంకేతిక ఉత్కృష్టతల పట్ల మాటర్ యొక్క మడమతిప్పని నిబద్ధతను సూచిస్తాయి.
మాటర్ లో, ఆవిష్కరణ అనేది కేవలం ఒక లక్ష్యము మాత్రమే కాదు; అది ఒక జీవనశైలి. భారతదేశపు శక్తి అంశాన్ని విప్లవాత్మకమైన మార్పుపై దృష్టితో, కట్టింగ్-ఎడ్జ్ భవిష్యత్ మొబిలిటి ఉత్పత్తులు మరియు ఆధునిక శక్తి నిల్వ పరిష్కారాలను అభివృద్ధి చేయడములో మాటర్ అందరి కంటే ముందు ఉంటుంది. రెండు కీలక విభాగాల ద్వారా పనిచేస్తూ – మాటర్ మొబిలిటి మరియు మాటర్ శక్తి – ఈ కంపెనీ కర్బన పాదముద్రలను తగ్గించడము, శక్తి సామర్థ్యాన్ని పెంచడము మరియు పచ్చదనము మరియు మరింత స్థిరమైన ప్రపంచానికి దోహదపడుటకు ప్రజలకు సాధికారతను అందించడములో నిబద్ధత కలిగి ఉంది.
ఆర్ధిక సంవత్సరము 2023-2024లో, 15 గ్రాంట్ చేయబడిన పేటెంట్స్ మరియు 62 ప్రచురించబడిన పేటెంట్స్ త్ ఓ మాటర్ యొక్క మేథోసంపత్తి విజయాలు సాధించింది. ఈనాటి వరకు 25 గ్రాంట్స్ మరియు 76 ప్రచురణలతో సహా మాటర్ 250+ పేటెంట్ దరఖాస్తుల పోర్ట్‌ఫోలియో కలిగి ఉంది. కీలక పరిశ్రమ సవాళ్ళను పరిష్కరించడం మరియు మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్స్ యొక్క థర్మల్ మేనేజ్మెంట్, ఆన్-బోర్డ్ చార్జర్స్, సెల్-ఆరే సాంకేతికత, ఎండ్-ఆఫ్-లైఫ్ పరీక్ష, పవర్ ప్యాక్ అసెంబ్లీ, గేర్ బాక్స్ అసెంబ్లీ, వివిధ మోటార్ అసెంబ్లీలు మరియు వాహన ఫ్రేమ్ డిజైన్ వంటి కీలక రంగాలలో నూతన పరిష్కారాలను అందించడముతో ఈ పేటెంట్స్ వ్యూహాత్మకంగా సమలేఖనం చేయబడ్డాయి.
కుమార్ ప్రసాద్, తెలికేపల్లి, సహ-వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ సిటీఓ, మాటర్, ఈ గుర్తింపు కొరకు తన ప్రగాఢ కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఇలా పేర్కొన్నారు.. ” సాంకేతికత మరియు ఆవిష్కరణ కొరకు దృఢమైన డ్రైవ్ ద్వారా శక్తి మరియు మొబిలిటి రంగములో ప్రజల మరియు గ్రహము యొక్క సమస్యలను పరిష్కరించడము కొరకు మాటర్ ఎడతెగని అభిరుచితో పనిచేస్తుంది. సాధ్యమయ్యే దాని హద్దులను చెరిపి పనిచేయడములో మా బృందము యొక్క తిరుగులేని నిబద్ధత, శక్తి స్వాతంత్ర్యం వైపుకు భారతదేశము యొక్క ప్రయాణాన్ని పునర్నిర్వచించే పరివర్తనాత్మక పురోగతులకు దారితీసింది. గ్రహము మరియు దాని ప్రజలపై సానుకూల ప్రభావము చూపే సుస్థిరమైన శక్తి పరిష్కారాలకు మార్గదర్శనం చేయడాన్ని కొనసాగించుటకు ఈ గుర్తింపు మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది.”
పైగా అత్యధిక నిపుణులు మరియు అనుభవజ్ఞులు ఉన్న అంకితభావము కలిగిన బృందముతో, మాటర్ రాబోయే తరాలకు ఒక శుభ్రమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించుటకు ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్ళడాన్ని కొనసాగిస్తుంది.