Friday, December 20, 2024

ప్రజ్వల్ పాస్‌పోర్టు రద్దు చేయండి…. మోడీకి సిద్దరామయ్య మరో లేఖ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన దౌత్యపరమైన పాస్‌పోర్టును రద్దు చేయడానికి సత్వరంగా, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అర్థిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి రెండవ లేఖ రాశారు. పరిస్థితి తీవ్రత తెలిసినప్పటికీ ఇదే అంశంపై తాను గతంలో రాసిన లేఖపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ముఖ్యమంత్రి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహరాలు, హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని మే 1న ప్రధానిక రాసిన లేఖలో సిద్దరామయ్య కోరారు. కాగా..జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ(సిట్) కూడా ఇటీవప్విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. ప్రజ్వల్ అరెస్టుకు కోర్టు నుంచి వారెంట్ జారీ అయిన నేపథ్యంలో హసన్ ఎంపి దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆ లేఖలో సిట్ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News