Thursday, January 23, 2025

ఫ్లాట్ గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నేడు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 7.65 లేక 0.01 శాతం నష్టపోయి 75410.39 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 10.56 లేక 0.05 శాతం నష్టపోయి 22957.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఎల్ అండ్ టి, భారతీ ఎయిర్ టెల్, బిపిసిఎల్ ప్రధానంగా లాభపడగా, అదానీ పోర్ట్స్ సెజ్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్ర, ఐటిసి నష్టపోయాయి.  రూపాయి విలువ డాలరుతో  పోల్చినప్పుడు 0.20 పైసలు లేక 0.24 శాతం నష్టపోయి  రూ. 83.09 వద్ద ట్రడేడయింది. ఇక ఎంసిఎక్స్ లో 10 గ్రాముల బంగారం రూ. 48 లేక 0.07 శాతం నష్టపోయి రూ. 71529.00 వద్ద ట్రేడయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News