- Advertisement -
ముంబై: కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్, హైదరాబాద్ జట్టుపై సెమీస్ లో గెలిచాక కెకెఆర్ టీమ్ ఓనరు, ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ ప్రేక్షకులకు చేయి ఊపుతూ స్టేడియలో తిరుగుతూ కనిపించారు. అప్పుడాయన చేతికి ధరించిన ఖరీదైన వాచీపై కొందరి దృష్టి పడింది. ఆ వాచీ పేరు ఫిలిప్పో నాటిలస్ 5980/600. దాని ధర రూ. 65,74,000. ఇదిలా ఉండగా షారూఖ్ ఖాన్ ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ ఆయనకు స్పోర్ట్ మీద ఉన్న మక్కువ కొద్దీ ఐపిఎల్ మ్యాచ్ కు వచ్చి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. రేపు(ఆదివారం) సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో షారూఖ్ ఖాన్ టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నది. విజేత ఎవరవుతారో చూద్దాం.
- Advertisement -