Saturday, December 21, 2024

పర్వతారోహకురాలు పూర్ణ ను అభినందించిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. ఎవరెస్టును ఎక్కి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కను పూర్ణ కుటుంబ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క పూర్ణను అభినందించి, సత్కరించారు. అంతే కాకుండా ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్ శిఖరంతో పాటు, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, ఉత్తర అమెరికాలోని దెనాలి వంటి శిఖరాలను, అతి ఎత్తయిన పర్వతాలను అధిరోహించి ‘ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా చరిత్ర సృష్టించిందని సీతక్క కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News