- Advertisement -
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్’ తుఫాన్ బలపడింది. ఆదివారం తెల్లవారుజామున 5గంటలకు తీవ్ర తుపాన్‌గా మారింది. ఈరోజు అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో అధికంగా ఈ తుఫాన్ ప్రభావం చూపించనున్నట్లు తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాలపై ఈ తుఫాన్ ప్రభావం పెద్దగా లేదని పేర్కొంది.
- Advertisement -