Thursday, December 19, 2024

చకచకా గేట్ల తొలగింపు పనులు

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న20వ గేటు కటింగ్

నేడు బ్యారేజీని సందర్శించనున్న నీటిపారుదలశాఖ
ఇఎన్‌సి అనిల్ కుమార్

మన తెలంగాణ/మహాదేవపూర్: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్‌లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించా రు. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) సూచించింది. ఏడో బ్లాక్‌లో ఏడు గేట్లను ఎత్తే ప్రక్రియ మి గిలి ఉంది. 18, 19, 20, 21 పియర్‌ల గేట్లు ఎత్తడానికి వీలులేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు ఉన్నారు. శనివా రం 20వ గేట్ కటింగ్ పనులను ప్రారంభించా రు. ఈ బ్లాక్‌లోని మిగిలిన మూడు గేట్లు ఎత్తడాని కి వీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లు స మాచారం.

వాటిని గుర్తించి, నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోం ది. వీటిని వానాకాలం ప్రారంభానికి ముందే పైకి ఎత్తాలని ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల కమిటీ తన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది. దీంతో కాస్త ప్రయత్నించి 15వ నంబర్ గేటును ఎత్తగలిగారు. మరో రెండింటిని ఎత్తేందుకు చాన్స్ ఉందని.. మిగతా వాటిని కట్ చేయాల్సిందేనని తేల్చారు. ఈ గేట్ల పనులకు తోడు ఎన్‌డిఎస్‌ఎ సూచించిన అత్యవసర మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని నీటి పారుదల శాఖ ఇఎన్‌సి (జనరల్) అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మేడిగడ్డను సందర్శించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News