Saturday, December 21, 2024

యూపిలో ఈవిఎంలతో పట్టుబడిన మినీ ట్రక్

- Advertisement -
- Advertisement -

అవి రిజర్వ్ మెషిన్లు అన్న డిఎం

జౌన్ పూర్: ఉత్తర్ ప్రదేశ్ లోని  జౌన్ పూర్ లో ఈవిఎంల లోడుతో ఉన్న మినీ ట్రక్ ను సమాజ్ వాదీ పార్టీ(ఎస్ పి) కార్యకర్తలు  స్ట్రాంగ్ రూమ్ వద్ద పట్టుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ ల నుంచి ఈవిఎంలను తరలించడంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు.

మినీ ట్రక్ లలో ఈవిఎంలు లోడ్ అయి ఉన్న వీడియో క్లిప్ లు ఇంటర్నెట్ లో కనిపించాక, జౌన్ పూర్ జిల్లా మెజి స్ట్రేట్(డిఎం) అవి రిజర్వ్ ఈవిఎంలని, పొరపాటున స్ట్రాంగ్ రూమ్ వెలుపల ఉంచినవన్నారు. ఆ వాదనకు ఆధారంగా అధికారులు ఎలాంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా అధికారులు ఇవ్వడం లేదని సమాజ్ వాదీ కార్యకర్తలు వాదిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో మే 25(శనివారం)న ఆరో దశ ఎన్నికలు ముగిశాక ఈ ఘటన తెరపైకి వచ్చింది. సమాజ్ వాదీ కార్యకర్తలు ఈవిఎంలతో ఉన్న మినీ ట్రక్ గుర్తించాక హెచ్చరికలు చేశారు. వారు వాహనాన్ని మధ్యలోనే అడ్డుకుని వాదులాటకు దిగారు. అధికారులు వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు.

దాంతో జిల్లా మెజిస్ట్రేట్ ఉరుకుల పరుగులపై ఘటనా స్థలికి చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అవి ఉపయోగించిన ఈవిఎంలు కావని, వాటిని మామూలుగానే వేరే చోటికి తరలిస్తున్నట్లు నచ్చజెప్పారు. అయినా సమాజ్ వాదీ కార్యకర్తలు నమ్మలేదు. ఈవిఎంలను ట్యాంపర్ చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News