Sunday, January 19, 2025

మధ్యంతర బెయిల్ మరో వారం పొడిగించండి:కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలపూ తన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను ఒక వారం పాటు పొడిగించవలసిందని కోరుతూ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు . తాను ఏడు కిలోల బరువు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. ఇడి మార్చి 21న అరెస్టు చేసిన ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఈ నెల 10న మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసింది.

జూన్ 2న లొంగిపోవాలని ఆయనను కోర్టు ఆదేశించింది. అయితే, తన మధ్యంతర బెయిల్ గడువు జూన్ 1న ముగియడానికి ఆరు రోజుల ముందు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉన్నందున ఏడు రోజుల పాటు తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కేజ్రీవాల్ అభ్యర్థించారు. పిఇటి సిటి స్కాన్ సహా కొన్ని డయాగ్నోస్టిక్ పరీక్షలు/ పరిశీలనలు చేయించుకోవలసి ఉందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News