Friday, December 20, 2024

మే 31న సిట్ ముందుకు వస్తా: ప్రజ్వల్ రేవణ్ణ

- Advertisement -
- Advertisement -

ఈ నెల 31న(శుక్రవారం) ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట హాజరవుతానని హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ ప్రకటించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఏప్రిల్ 27 న దేశం విడిచి పారిపోయిన ్ర33 ఏళ్ల పజ్వల్ రేవణ్ణ సోమవారం ఒకవీడియో సందేశం విడుదల చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడైన జెడిఎస్ ఎంపిపై అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. మే 31న సిట్ ఎదుట హాజరవుతానని పేర్కొంటూ ప్రజ్వల్ ఒక వీడియోను విడుదల చేశారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట ఉంటాను..సహకరిస్తాను. న్యాయవ్యవస్థను నేను నమ్ముతున్నాను. నాపైన పెట్టినవన్నీ తప్పుడు కేసులు. చట్టాన్ని నేను నమ్ముతాను అని ఆ వీడియోలో ప్రజ్వల్ ఆరోపించారు. ఈ వీడియోలో తాను ఎక్కడ ఉన్నదీ ఆయన వపెల్లడించలేదు. తన తల్లిదండ్రులకు, తాతకు, బాబాయికి(హెచ్‌డి కుమారస్వామి), జెడిఎస్ కార్యకర్తలకు ఆయన క్షమాపణలు చెప్పారు.

వందలాది మంది మహిళలపై తాను అత్యాచారానికి పాల్పడినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోసహా పలువురు నాయకులు తనపైన చేసిన ప్రకటనల కారణంగా తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ప్రజ్వల్ ఆ వీడియోలో తెలిపారు. తనపైన జరిగిన రాజకీయ కుట్ర కారణంగా తనకు తానుగా అందరికీ తూరంగా వెళ్లిపోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. తనపైన తప్పుడు కేసులు బనాయించిన వారికి చట్టపరంగా పోరాడుతూ సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 27న తాను విదేశాలకు వెళ్లానని, ఆ సంయంలో తనపైన ఎటువంటి కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. తాను ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే బయల్దేరి వెళ్లానని, ఆ సమయంలో తనపైన ఎటువంటి కేసు నమోదు కాలేదని ఆయన చెప్పారు. మొదటి నోటీసు తాను అందుకున్నప్పుడు తన న్యాయవాది ద్వారా ఏడు రోజుల సమయం కోరానని ఆయన చెప్పారు. తనపైన నమ్మకం ఉంచాలని ఆయన తన కుటుంబాన్ని, అనుచరులను, పార్టీ కార్యకర్తలను అభ్యర్థించారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News