Friday, December 20, 2024

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు. అయితే ఫస్ట్ లాంగ్వేజ్(కంపోజిట్ కోర్సు)ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, సైన్స్ పార్ట్- 1 ఫిజికల్ సైన్స్‌ను, పార్ట్ 2 బయోలాజికల్ సైన్స్‌ను ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 51,237 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో 31,625 మంది బాలురు, 19,612 మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. టెన్త్ అడ్వాన్స్‌డ్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్షల కోసం 170 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 170 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 1300 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించన్నుట్లు తెలిపారు. టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించడంతో పాటు www.bse.telanagana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News