Sunday, November 24, 2024

ఉద్యమ ముద్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా ని ర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్త మవుతోంది. అందులో భాగంగా రాష్ట్ర అ ధికార చిహ్నం, రాష్ట్ర గీతాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సిఎం రేవంత్ రెడ్డి సోమవారం చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమం త్రి అందులో ఒకదానిని ఫైనల్ చేశారు. ప్రము ఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చి హ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగం గా సుమారు 12 నమూనాలు సిఎం రేవంత్‌కు చూపించగా, వాటిలో ఒకటి సిఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన చిహ్నానికి తుది మార్పులను సిఎంసూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయి తే రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వా మ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించాలని సిఎం భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అధికారిక చిహ్నానికి తుదిరూపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. జూన్ 2న రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు.

కొలిక్కి వస్తున్న తెలంగాణ తల్లి రూపం
రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సిఎం సూచనలతో భావం, భావోద్వే గం మారకుండా రెండు నిమిషాలకు కవి అం దెశ్రీ మార్పులు తరువాయి 6లో
చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కవి అందెశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. జూన్ 2న అధికార గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కి వస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి జరుగుతున్న అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని తెలంగాణకు తీసుకురావడానికి పిసిసి కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఏఐసిసి నేతలతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటివరకు ఏఐసిసి నుంచి సోనియాగాంధీ హాజరుపై స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని సిఎం రేవంత్ భావించారు. అందులో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్లినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేరళ వెళ్లారు. అక్కడ కోజీకోడ్‌లోని ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణలో సిఎం రేవంత్ పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లినట్టుగా పిసిసి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పంజాబ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఉన్న డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి చేరుకున్నట్లుగా తెలిసింది. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, సిఎం రేవంత్ రెడ్డితో కలిసి సోనియాగాంధీతో సమావేశమయ్యే అవకాశముందని పిసిసి వర్గాలు పేర్కొంటు న్నాయి. ఇప్పటికే రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్టుగా సమాచారం.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిసిసి
సోనియాగాంధీతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేలను సైతం పిసిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో ప్రజల్లోకి మంచి సందేశం వెళ్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడడం పిసిసికి ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి, తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియమ్మగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీని ఘనంగా సత్కరించడంతో పాటు రాష్ట్రగీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనారోగ్య కారణాలు, జూన్ 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కిపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సోనియాగాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేక ఆమె రాకుండా రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను మాత్రమే పంపుతారా అన్నది త్వరలోనే తేలనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News