పాట్నా: తన మాజీ బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆర్‌జెడి అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మరోసారి రంగులు మార్చేందుకు ఆయన(నితీష్) సిద్ధపడతారని తేజస్వి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ..జూన్ 4 తర్వాత తన పార్టీని కాపాడుకునేందుకు, వెనుకబడిన తరగతుల రాజకీయాలను రక్షించుకునేందుకు మా అంకుల్(నితీష్) దేనికైనా తెగిస్తారు. ఆయన ఎటువంటి పెద్ద నిర్ణయమైనా తీసుకుంటారు అని ఎద్దేవా చేశారు. గత దశాబ్ద కాలంలో నితీష్ కుమార్ ఐదుసార్లు కూటములను మార్చారు.
చివరిసారి ఎన్‌డిఎతో చేతులు కలిపిన తర్వాత ఇదే చివరిదని కూడా ఆయన చెప్పారు. ఒకసారి బిజెపి కూటమితో, మరోసారి ప్రతిపక్ష కూటమితో ఇలా పలుసార్లు అటుఇటు జతకట్టిన నితీష్ కుమార్ గెలుపు గుర్రాల వైపే ఉండడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రస్తుత లోక్‌సభ ఎన్ని షయాన్నే తేజస్వి తన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు. కాగా..ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో ఇండియా కూటమికి, ఎన్‌డిఎ కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలలో నితీష్ కుమార్‌కు చెందిన జెడియు, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ ఎన్‌డిఎ కూటమిలోనే ఉండి బీహార్‌లోని 40 స్థానాలలో ఒకటి మినహాయించి మిగిలిన స్థానాలన్నిటినీ కైవసం చేసుకున్నాయి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.