Friday, December 20, 2024

లోయలో పడిన బస్సు: 28 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బలూచిస్థాన్: పాకిస్థాన్ దేశం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని వాషుక్ జిల్లాలో బుధవారం ఉదయం బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బసిమా సివిల్ ఆస్పత్రికి తరలించారు. గ్వాదర్ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ముందు టైర్ పేలడంతో అదుపు తప్పి లోయలోకి పడిపోయిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News