Sunday, January 19, 2025

పాక్ బస్సు ప్రమాదంలో 28 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కరాచి: పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్సులో బుధవారం ఉదయం వేగంగా వెళుతున్న ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో మహిళలు, పిల్లలతోసహా 28 మంది మరణించారు. తుర్బాత్ నుంచి క్వెట్టా వెళుతున్న బస్సు వషుక్ పట్టణ సమీపంలో ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మరణించగా మరో 22 మంది గాయపడ్డారని, వారిని బసీమాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బలోచిస్తాన్ ప్రావిన్సు రాజధాని క్వెట్టాకు సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

కాగా..మే 18న పంజాబ్‌కు చెందిన ఖుషాబ్ జిల్లాలో ఒక ట్రక్కు గోతిలో పడడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మరణించారు. మే 3న గిల్గిట్ బల్టిస్తాన్‌లో ఇరుకైన పర్వత మార్గంలో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 20 మంది మరణించగా మరో 21 మంది గాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News