Friday, December 20, 2024

బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. రెండోసారి నటి హేమకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోమారు బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు పంపారు. జూన్ 1న స్వయంగా హేమ విచారణకు హాజరు కావాలని నోటీసులో వెల్లడించారు. ఈ నెల 27న కేసు విచారణకు హాజరుకావాలని అదే నెల 25న హేమతో సహా 8 మందికి పోలీసులు నోటీసులు పంపించారు. కానీ నటి హేమ మాత్రం విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణా లు చూపుతూ విచారణకు ఒక వారం గడువు కావాలని కోరింది. దీంతో సిసిబి పోలీసులు మరో నోటీసును విచారణకు జూన్ 1న విచారణకు హాజరు కావాల్సిందిగా పంపించారు. మే 20వ తేదీ రాత్రి బెంగళూరు శివార్లలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ విషయంపై సిసిబి పోలీసులు తెలుసుకుని దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత ఘటనాస్థలంలో కొన్ని మాదకద్రవ్యాలు, ఎపి ఎంఎల్‌ఎ పాసు ఉన్న కారు కూడా లభ్యమయ్యాయి.

పార్టీలో పాల్గొన్న 103 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. అలాగే పార్టీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై వాసు, యం.అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్ అబూబకర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.ఈ క్రమంలో నటి హేమతో సహా 8 మందికి సిసిబి పోలీసులు విచారణకు హాజరు కావాలని ఈనెల 25న నోటీసులు పంపించారు. ఈనెల 27న విచారణకు నటి హేమ వెళ్లలేదు. అందుకు ఆమె అనారోగ్య కారణాలను చూపించారు. అంతకు ముందు ఆమె ఆ రేవ్ పార్టీలో పాల్గొనలేదంటూ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే బెంగళూరు సిపి మాత్రం నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని వెల్లడించారు. అయితే ఆమెకు డ్రగ్స్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. పోలీసులు మళ్లీ రెండోసారి జూన్ 1న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News