Monday, December 23, 2024

ఐఐటి మద్రాస్ స్టార్టప్ విజయవంతంగా ప్రయోగించిన రాకెట్

- Advertisement -
- Advertisement -

పూర్తి 3-డి ప్రింటెడ్ ఇంజిన్ తో రూపొందించిన ప్రపంచంలోనే తొలి రాకెట్

చెన్నై: ఐఐటి మద్రాస్ లో ప్రారంభమైన అగ్నికుల్ కాస్మోస్, సింగిల్ పీస్ త్రీడీ(3డి) ప్రింటెడ్ ఇంజన్ తో ప్రపంచంలోనే మొట్టమొదటి  అగ్నిబాణ్ రాకెట్ ను గురువారం ప్రయోగించింది.

రాకెట్ అగ్నిబాన్ SOrTeD (సబ్ ఆర్బిటల్ టెక్నలాజికల్ డెమోన్‌స్ట్రేటర్) అనేది భారతదేశపు మొట్టమొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్-ఆధారిత రాకెట్ ప్రయోగం, ఇది పూర్తిగా స్వదేశీంగా తయారు చేసింది.

గురువారం ఉదయం 7.15 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో అగ్నికుల్ స్థాపించిన  ‘ధనుష్’  అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన లాంచ్‌ప్యాడ్ నుండి దీనిని ప్రయోగించారు. లాంచ్ ప్యాడ్ శ్రీహరికోటలోని ఇస్రో రాకెట్ పోర్టులో ఉంది.

అగ్నిబాన్ రెండు దశల రాకెట్, ఇది 300 కిలోల బరువును 700 కిలోమీటర్ల ఎత్తు పేలోడ్ మోసుకెళ్లగలదు. రాకెట్ ఇంజన్లు లిక్విడ్ ఆక్సిజన్/కిరోసిన్ ద్వారా శక్తిని పొందుతాయి.

ప్రైవేట్ రాకెట్ తయారీదారు 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కక్ష్య మిషన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది,  CY 2025 నుండి క్రమం తప్పకుండా ప్రారంభమయ్యే ఫ్లయిట్లలో కస్టమర్‌లతో కలిసి పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News