Monday, December 23, 2024

చార్మినార్ దగ్గర కెటిఆర్ నిరసన

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాజముద్రలో కాంగ్రెస్ సర్కార్ మార్పులు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి చార్మినార్ దగ్గరకు వెళ్లి కెటిఆర్ నిరసన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని ఫైరయ్యారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. లోగోలో చార్మినార్ ను తొలగించడమంటే హైదరాబాద్ ను అవమానించడమేనని దుయ్యబట్టారు.

కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని నిలదీశారు. చార్మినార్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. రాజకీయ కక్షతోనే  కాంగ్రెస్ ప్రభుత్వం  లోగోలో  మార్పు చేస్తోందని నిప్పులు చెరిగారు. లోగో మార్పుపై  పెద్ద ఎత్తున  బీఆర్ఎస్ నిరసన  కార్యక్రమాలు  చేపడతామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన గుర్తులను కావాలనే సీఎం రేవంత్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News