Friday, December 20, 2024

ప్రేమికుడు వేధింపులు… ప్రియురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు బెదిరించాడు ప్రేమికుడు. ప్రియురాలి ఆత్మహత్యకు  కారణమయ్యాడు సదరు ప్రబుద్ధుడు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్ ఎల్ బి నగర్ లో బాల బోయిన కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు కుమార్తె అఖిల(22) ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది. అఖిలను పక్కింట్లో ఉండే అఖిల్ సాయి గౌడ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడి పలుమార్లు వేధించాడు. తన ప్రేమలో ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు బెదిరించడంతో తప్పని పరిస్థితితో అఖిల అతని ప్రేమను ఒప్పుకుంది.

ఇదే విషయాన్ని వాళ్ల కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చింది. సదరు విషయం స్థానికులకు బంధువులకు తెలియడంతో సాయి గౌడ్, ఆయన కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. ఆ ఇష్టాన్ని కాదనలేక బంధువుల సమక్షంలో అందరు మాట్లాడడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ప్రేమను ఒప్పుకున్నప్పటి నుంచి సాయి గౌడ్ అఖిలను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. రోడ్డుమీద అందరూ చూస్తుండగానే కొట్టడం చిత్ర హింసలకు గురి చేసేవాడు. అంతే కాకుండా ఫోన్ లో కూడా వేధించేవాడని సమాచారం. అఖిల ఆత్మహత్య చేసుకుంది. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో అఖిల మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News