Wednesday, January 1, 2025

ఏడో విడత పోలింగ్‌కు ముగిసిన ప్రచారం

- Advertisement -
- Advertisement -
వారణాసిలో తుది విడత పోలింగ్

చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్

జూన్ 1వ తేదీన పోలింగ్

తుది విడతలోనే వారణాసి, మండి, గోరక్‌పూర్ నియోజకవర్గాలకు పోలింగ్

న్యూఢిల్లీ:  ఏడో… చివరి విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. చివరి విడతలో 8 రాష్ట్రాలలోని 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీహార్ (8), హిమాచల్ ప్రదేశ్ (4), జార్ఖండ్ (3), ఒడిశా (6), పంజాబ్ (13), ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (9)… రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. చంఢీగఢ్‌లోనూ పోలింగ్ జరగనుంది.

చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోడీ, మండి నుంచి బిజెపి అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవి కిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News