Friday, December 20, 2024

ఎన్నికల్లో పోటీ చేయకుండా మోడీపై అనర్హత వేటు వేయాలి… పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీని అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌ను ఢఙల్లీ హైకోర్ట్టు గురువారం కొట్టివేసింది. ఇది నిరాధార, నిర్లక్షంతో దాఖలుచేసిన పిటిషన్‌గా కోర్టు అభివర్ణించింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు దురుద్దేశంతో కూడుకున్నవని, వీటిని అనుమతించలేమని జస్టిస్ సచిన్ దత్తా పేర్కొన్నారు. తాను పైలట్‌గా పనిచేస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని 2018లో కూల్చడం ద్వారా దేశ భద్రతను దెబ్బతీయడానికి మోడీ, ఆయన సహచరులు ప్రయత్నించారని కెప్టెన్ దీపక్ కుమార్ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ను పూర్తిగా అసంబద్ధమైనదిగా కోర్టు అభిప్రాయపడింది. ప్రధాని మోడీపై నిరాధార ఆరోపణలు చేయడానికే ఈ పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కేంద్ర హోం మత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల అభ్యర్థిత్వాలపై కూడా అనర్హత వేటు వేయాలని పిటిషనర్ కోరారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడినని నరేంద్ర మోడీ రిటర్నింగ్ అధికారి ముందు తప్పుడు ప్రతిజ్ఞ చేశారని కూడా పిటిషనర్ ఆరోపించారు. ఎయిర్ ఇండియా అమ్మకంలో చురుకైన పాత్ర పోషించడం ద్వారా ప్రధాని మోడీ సాక్ష్యాలను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. తన సర్వీసు రికార్డులను తారుమారు చేయడం ద్వారా తన పైలట్ లైసెన్సును ఎయిర్ ఇండియా రద్దు చేసిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News